MK Stalin | కేరళకు తమిళనాడు ప్రభుత్వం ఆపన్నహస్తం.. సీఎం నిధుల కింద రూ.5 కోట్లు విడుదల
MK Stalin | ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళ (Kerala) రాష్ట్రానికి తమిళనాడు ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది.
MK Stalin | ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళ (Kerala) రాష్ట్రానికి తమిళనాడు ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin).. కేరళ రాష్ట్రానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. సీఎం నిధుల కింద రూ.5 కోట్లు విడుదల చేయాలని అధికారులను స్టాలిన్ ఆదేశించారు.
వయనాడ్ (Wayanad)లో కొండచరియలు విరిగిపడి 63 మంది జలసమాధి అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన స్టాలిన్.. కేరళ సీఎం పినరయి విజయన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా మృతులకు సంతాపం ప్రకటించారు. ఈ కష్టకాలంలో తమిళనాడు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రకృతి ప్రకోపానికి గురై విలవిల్లాడుతున్న కేరళ ప్రభుత్వానికి సాయం చేసేందుకు ఇద్దరు ఐఏఎస్ కేడర్ల నేతృత్వంలో రెస్క్యూ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు సీఎం ప్రకటించారు. ఆ టీమ్‌ను కేరళకు పంపిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 10 మంది వైద్యులు, నర్సులతో కూడిన ఓ వైద్య బృందాన్ని కూడా కేరళ రాష్ట్రానికి పంపిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు వయనాడ్ విలయంపై కర్ణాటక ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ విపత్కర పరిస్థితుల్లో కేరళ రాష్ట్రానికి అన్ని విధాలా సాయమందిస్తామని హామీ ఇచ్చారు.
CM MK Stalin also ordered to release Rs 5 crores for relief measures to Kerala Government from Tamil Nadu government from CM General funds From Tamil Nadu, 20 fighters from the Fire rescue department headed by its Joint Director, 20 fighters from the State Disaster Management…
— ANI (@ANI) July 30, 2024
Also Read..
Wayanad | 24 గంటల్లో 372 మిల్లీమీటర్ల వర్షపాతం.. వయనాడ్ విలయంలో 60 దాటిన మృతుల సంఖ్య
Kerala | కేరళలో రానున్న 24 గంటల్లో భారీ వర్షం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Wayanad Landslides: వయనాడ్ విలయం.. వీడియోలు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Kerala
- landslides
- MK Stalin
- Wayanad
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

