Wayanad | 24 గంటల్లో 372 మిల్లీమీటర్ల వర్షపాతం.. వయనాడ్ విలయంలో 60 దాటిన మృతుల సంఖ్య
Wayanad | కేరళ రాష్ట్రం వయనాడ్ (Wayanad)లో కొండచరియలు (Landslides) విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 60 దాటింది.
Wayanad | కేరళ రాష్ట్రం వయనాడ్ (Wayanad)లో కొండచరియలు (Landslides) విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 60 దాటింది. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకూ ఈ విలయంలో 63 మంది జలసమాధి అయ్యారు. సుమారు 100 మందిదాకా గాయపడ్డారు. వారు మెప్పడిలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు స్థానిక మీడియా నివేదించింది. ఇక పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారంతా శిథిలాల కింది నుంచే తమ ఆత్మీయులకు ఫోన్ చేసి తమను కాపాడండి అంటూ విలపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానిక మీడియా టీవీల్లో ప్రసారం చేస్తోంది.
మెప్పడి, ముందక్కాయి పట్టణం, చూరల్ మాలాలో మంగళవారం తెల్లవారుజామున ఈ విలయం సంభవించింది. తొలుత రాత్రి ఒంటి గంటకు ముందక్కాయి పట్టణంలో భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే.. చూరల్‌మాలాలో తెల్లవారుజామున 4 గంటలకు మట్టిచరియలు విరిగిపడ్డాయి. క్యాంపుగా మారిన స్కూల్‌తో పాటు సమీప ఇంళ్లలోకి నీరు ప్రవేశించింది. వరద నీరు, బురదతో నిండిపోయాయి. రాష్ట్రంలో కేవలం 24 గంటల్లో 372 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఈ విలయంలో చూరల్ మాలా పట్టణం సగం వరకూ తుడిచి పెట్టుకుపోయినట్లు స్థానిక మీడియా నివేదించింది. చూరల్ మాలాలో బ్రిడ్జ్ కూలిపోవడంతో సుమారు 400 కుటుంబాలు అక్కడ చిక్కుకుపోయాయి. వరద కారణంగా రోడ్లు, వంతెనలు సైతం పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో రెస్క్యూ ఆపరేషన్స్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు, ఆర్మీ వర్షంలోనే సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. సుమారు 225 మంది సైనిక సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకూ 220 మందిని అధికారులు రక్షించి వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వయనాడ్ విలయానికి చెందిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తీవ్రంగా ప్రవహిస్తున్న నీటిలో ఓ కారు కొట్టుకుపోయింది. ముందక్కాయిలో ఉన్న ఓ మదరసాలో 150 మంది చిక్కుకున్నారు. 4 గంటల్లోనే మూడుసార్లు కొండచరియలు విరిగిపడడంతో.. రోడ్లు, బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయాయి. రైల్వే లైన్లు కూడా దెబ్బతినడంతో.. రైలు సర్వీసులను అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు.
Also Read..
Mamata Banerjee | దేశంలో రైలు ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి.. జార్ఖండ్ ఘటనపై బెంగాల్ సీఎం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

