Suhana Khan | సుహానా ఖాన్ (Suhana Khan).. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ (shahrukh khan), గౌరీ ఖాన్ దంపతుల గారాల పట్టి. ఇటీవలే ‘ది ఆర్చీస్’ వెబ్‌సిరీస్ ద్వారా ఓటీటీ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటుంది ఈ స్టార్ కిడ్. తన స్టేటస్‌కు తగ్గట్లుగానే నిత్యం ట్రెండీ, ఖరీదైన దుస్తుల్లో నెట్టింట ఆకర్షిస్తుంటుంది. తాజాగా ఈ భామ ధరించిన హెయిర్ క్లిప్ (leather hairclip) ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవలే సుహానా ఓ పార్టీకి వెళ్లింది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫొటోల్లో బాడీకాన్ దుస్తుల్లో సుహానా ఎంతో అందంగా కనిపించింది. అయితే, ఆ ఫొటోల్లో అందరి దృష్టీ తన హెయిర్‌ను అందంగా అలంకరించుకునేందుకు ఉపయోగించిన క్లిప్‌పై పడింది. సాధారణంగా సుహానా ధరించే దుస్తులు, ఇతర యాక్సెసరీల ఖరీదు లక్షల్లో పైమాటే ఉంటుంది. ఇప్పుడు ఈ లెదర్ హెయిర్ క్లిప్ ధర కూడా అంతే. ఇది అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ ప్రాడా (Prada)కు చెందినది. దీని ఖరీదు 600 యూఎస్ డాలర్లు. అంటే మన భారత కరెన్సీలో రూ.50,238 అన్నమాట.
ఇక ఈ ఫొటోల్లో సుహానా ధరించి హ్యాండ్ బ్యాగ్ కూడా నెటిజన్లను ఆకర్షిస్తోంది. దాని ఖరీదు ఏకంగా లక్షల్లో ఉంది. ఆ బ్రాండ్ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. సుహానా ధరించి హెర్మేస్ మినీ కెల్లీ 28 బ్యాగ్ ధర 26,570 అమెరికన్ డాలర్లుగా ఉంది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం.. అక్షరాలా రూ.22 లక్షలన్నమాట. ఈ స్టార్ కిడ్ ధరించిన వస్తువుల ధరలు చూసి నెటిజన్లు ఒక్కసారిగా నోరెళ్లబెడుతున్నారు. ఎంత స్టార్ కిడ్ అయితే మాత్రం.. తలకు ధరించే క్లిప్‌కు, హ్యాండ్ బ్యాగ్‌కు ఇంత డబ్బు ఖర్చు చేస్తారా..? అంటూ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. ప్రస్తుతం సుహానా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
జోయా అక్తర్ దర్శకత్వంలో అగస్త్యనంద హీరోగా నటించిన అమెరికన్ కామిక్ బుక్ సిరీస్ ‘ది ఆర్చీస్’ ద్వారా సుహానా ఖాన్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. తాజాగా తన తండ్రి షారుక్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధమైంది. సుజయ్‌ఘోష్ దర్శకత్వంతో యాక్షన్ ఎంటర్టైనర్ ‘కింగ్’ చిత్రంలో నటించబోతోంది. ఈ ప్రాజెక్ట్‌ని రెడ్‌చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, మార్ప్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Wayanad | వయనాడ్ విలయం.. 56కి పెరిగిన మృతుల సంఖ్య
Mamata Banerjee | దేశంలో రైలు ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి.. జార్ఖండ్ ఘటనపై బెంగాల్ సీఎం