‘ఇది సుహాస్‌తో నా రెండో సినిమా. కెరీర్లో నా మూడో సినిమా. ఇంతకు ముందు చేసిన సినిమాలో ఇంటెన్స్ క్యారెక్టర్ చేశాను. ఇందులో లైటర్ వెయిన్‌లో సాగే ఎంటర్టైన్మెంట్ పాత్ర. ఎంజాయ్‌చేస్తూ ఈ పాత్ర చేశా. వినోదంతోపాటు ఇందులో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కూడా బావుంటుంది’ అని శివాని నగరం అన్నారు. సుహాస్‌కి జోడీగా ఆమె నటించిన చిత్రం ‘హే బలవంత్’. ‘హే భగవాన్’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ సినిమాను కొన్ని కారణాల దృష్ట్యా ‘హే బలవంత్’గా మార్చారు.
గోపీ అచ్చర దర్శకుడు. బి.నరేంద్రరెడ్డి నిర్మాత. బన్నీవాస్, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ నెల 20న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో శివాని నగరం విలేకరులతో ముచ్చటించింది. ‘వినగానే నచ్చిన కథ ఇది. వినోదంతోపాటు కలర్‌ఫుల్ విజువల్స్, మంచి మ్యూజిక్ కూడా ఇందులో ఉంది.
నా పాత్ర, సుహాస్ పాత్ర, నరేష్, వెన్నెల కిశోర్ ఇలా అన్ని పాత్రలూ మిమ్మల్ని నవ్విస్తాయి. సుహాస్ మంచి నటుడు, ఫ్రెండ్లీ కూడా. ఇందులో మా కాంబినేషన్ సీన్స్‌ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పారు. తెలుగు మాత్రమే కాక, ఇతర భాషల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయని, సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నాననీ, తమిళంలో రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయని, తెలుగులో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని శివాని నగరం తెలిపారు.