రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 16 : క్యాతనపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ ఎన్నిక నిరసనల మధ్య నిలిచింది. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు విధించారు. మున్సిపాలిటీలో 22 వార్డులుండగా ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏడుగురు విజయం సాధించారు. బీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థులు 14 మంది. ఒక స్వతంత్ర అ భ్యర్థి గెలుపొందారు. బీఆర్ఎస్, సీపీఐలు పాలక వ ర్గాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యారు.
అయితే ఎలాగైనా మున్సిపాలిటీని చేజిక్కించుకోవాలని కుట్ర పన్నిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేసి తమ వైపు తిప్పుకొనేందు కు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా భద్రాచలం క్యాంపులో ఉన్న అభ్యర్థులను కిడ్నాప్ చేసేందుకు కుటిల యత్నం చేశారు. ముందుగానే పసిగట్టిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వారిని క్యాతనపల్లికి తీసుకొచ్చి తన నివాసంలో ఉంచారు. ప్రధాక కూడళ్లు, కౌన్సిలర్లు వచ్చే దా రి, మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. రామకృష్ణాపూర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే కాకుండా ఇతర ప్రాంతాల నుం డి భారీ సంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

కాగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఏఐటీయుసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్లు బీఆర్ఎస్, సీపీఐ నాయకులతో కలసి అభ్యర్థులను ప్రత్యేక వాహనాలలో మున్సిపల్ కార్యాలయానికి తీసుకొస్తుండగా పోలీసులు ఆటంకం సృష్టించారు. మొదట మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటి సమీపంలోని రైల్వే ఫ్లై ఓవర్ వంతెన వద్ద వాహనాలను అడ్డుకొని కౌన్సిలర్లు మాత్రమే నడుచుకుంటూ వెళ్లాలని బారీకేడ్లను అడ్డుగా పెట్టారు.
బాల్క సుమన్‌తో పాటు సీపీఐ నాయకులు తా ము ఐదు వాహనాలకు ముందుగానే అనుమతి తీసుకున్నామని చెప్పినా వినకపోవడంతో మాజీ ఎమ్మెల్యే బా ల్క సుమన్, ఏఐటీయుసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామ య్య, సీపీఐ రాష్ట్ర నాయకులు శంకర్లు పార్టీల శ్రేణుల తో కలసి రోడ్డు పై బైఠాయించి రాస్తారోకో చేశారు. కొద్దిసేపటి తరువాత ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు రావడంతో పోలీసులు వెనకు తగ్గారు. అనంతరం కార్యాల యం సమీపంలో ఏర్పాటు చేసిన పికెటింగ్ వద్ద మళ్లి వాహనాలను నిలిపి వేసి కౌన్సిలర్లను మాత్రమే వెళ్లాలని ఇతరులకు అనుమతి లేదనడంతో పోలీసులు, నా యకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. పోలీసు లు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ము న్సిపల్‌లో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎవరు లేక పోయినప్పటికీ డీసీసీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి అభ్యర్థులకు విప్ జారీ చేస్తానని చెప్పి కార్యాలయంలోనే గంటన్నర పాటు తిష్టవేశాడు. నిబంధనలను ఉల్లగిస్తూ కాంగ్రెస్ శ్రేణులు కార్యాలయం చుట్టూ చేరి అలజడి సృష్టించే ప్రయత్నం చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం విమర్శలకు దా రి తీసింది. కార్యాలయం వద్ద నుండి వెళ్లగొట్టాల్సిన పోలీసులు వారికి కార్యాలయం ఎదుట కుర్చీలు వేసి మరీ కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా బీఆర్స్, సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. పోలీసులు అడ్డకోవడం వ ల్లనే తమ అభ్యర్థులు సరైన సమయంలో మున్సిపల్‌కు చేరుకోలేక పోయారని, దీని వల్లనే పాలక వర్గం ఎన్నిక వాయిదా పడిందని వారు తెలిపారు.