చెన్నూర్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న అసమ్మతి
చెన్నూర్‌లోని కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమన్నది. మంత్రి వివే క్ వెంకటస్వామిపై సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేశారు. చెన్నూర్ మున్సిపాలిటీలోని 17వ వార్డు కౌన్సిలర్ అజీమొద్దీన్‌కు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవి ఇవ్వలేదని, ఆ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో మంగళవా రం ఎమ్మెల్యే (మంత్రి) క్యాంపు కార్యాలయా న్ని ముట్టడించి, నిరసన తెలిపారు.
- మంత్రి వివేక్‌పై తిరుగబడ్డ సొంత పార్టీ నాయకులు
- 17వ వార్డు కౌన్సిలర్‌కు వైస్ చైర్మన్ పదవి ఇవ్వనందుకు క్యాంపు కార్యాలయం ముందు నిరసన
మంచిర్యాల, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చెన్నూర్‌లోని కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమన్నది. మంత్రి వివే క్ వెంకటస్వామిపై సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేశారు. చెన్నూర్ మున్సిపాలిటీలోని 17వ వార్డు కౌన్సిలర్ అజీమొద్దీన్‌కు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవి ఇవ్వలేదని, ఆ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో మంగళవా రం ఎమ్మెల్యే (మంత్రి) క్యాంపు కార్యాలయా న్ని ముట్టడించి, నిరసన తెలిపారు.
పలువురు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ పెద్దలు కాంగ్రెస్ పార్టీ అంటే కార్యకర్తల పార్టీ అన్నారని, కానీ, పార్టీలో కొత్తగా వచ్చిన వారికి పదవులు ఎలా ఇస్తారని వారు నిలదీశారు. ముం దు నుంచి పార్టీ కోసం కష్ట పడిన వారికి ఎం దుకు పదవులు ఇవ్వడం లేదని వారు నిలదీశారు. అజీమొద్దీన్ కుటుంబం పార్టీలో ఎన్నో ఏండ్ల నుంచి పని చేస్తున్నదని, అధికారంలో లేనప్పుడు కూడా వారు పార్టీ కోసం పని చేశారని పేర్కొన్నారు. పార్టీ కోసం పని చేసిన సీనియర్లను కాదని, ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి ఎలా పదవులు ఇస్తారని వారు మంత్రి వివేక్‌ను ప్రశ్నించారు.
ఇదేనా మీరు పార్టీ కోసం కష్ట పడిన వారికి, సీనియర్లకు చేసిన న్యాయం అంటూ వారు మంత్రి వివేక్‌ను నిలదీశారు. ఈ పద్ధతి బాగా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు మాత్రం న్యాయం కావాలని వారు డిమాండ్ చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఒకే ఇంట్లో వారికి (దగ్గరి, దగ్గరి బంధువులు) ఇచ్చారని వారు మండిపడ్డారు. ఇలాగైతే ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడ్డ వారికి మీరు ఏమి న్యాయం చేసినట్లను వారు అన్నారు. ఇప్పటికైనా మా కౌన్సిలర్‌కు వైస్ చైర్మన్ పదవి ఇచ్చి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

