10 వేల కోట్లు ఇచ్చినా.. హిందీని అంగీకరించం
ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న తమిళనాడులో ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతున్నది. సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, ఏఐఏడీఎంకేలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రూ.10,000 కోట్లు ఇచ్చినా హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దడానికి అనుమతించబోమని స్టాలిన్ అన్నారు.
- ఎన్నికల ప్రచారంలో తమిళనాడు సీఎం స్టాలిన్
చెన్నై, ఏప్రిల్ 12 : ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న తమిళనాడులో ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతున్నది. సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, ఏఐఏడీఎంకేలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రూ.10,000 కోట్లు ఇచ్చినా హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దడానికి అనుమతించబోమని స్టాలిన్ అన్నారు. హిందీ భాషను రుద్దేందుకు, రాష్ట్ర భాషా గుర్తింపును దెబ్బతీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు.
ఆదివారం పుదుక్కోైట్టెలో బహిరంగ సభలో స్టాలిన్ మాట్లాడుతూ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాత్ర విద్యను బలోపేతం చేయటమేగానీ, దానిని కాషాయీకరణ చేయటం కాదని అన్నారు. హిందీయేతర రాష్ర్టాల్లో హిందీని వ్యాప్తి చేయడానికి కేంద్రం విధానపరమైన సాధనాలను వాడుకుంటున్నదని ఆయన ఆరోపించారు. మూడు భాషల విధానాన్ని స్వీకరించడానికి నిరాకరించిన కారణంగానే, తమిళనాడుకు కేటాయించిన విద్యా నిధుల్లో రూ.2,000 కోట్లను నిలిపివేశారని ఆరోపించారు. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయేతో ఏఐఏడీఎంకే పెట్టుకున్న పొత్తుపైనా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

