Google Maps | కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ గూగుల్ మ్యాప్స్ (Google Maps)ను ఎక్కువగా వాడుతుంటారు. ఏదైనా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే గూగుల్ మ్యాప్ సాయంతో వెళ్తుంటారు. అలా కొన్ని సందర్భాల్లో కొందరికి ఊహించని అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి. గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని వెళ్లి కొందరు ప్రమాదాల బారిన పడిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా ఓ మహిళ గూగుల్ మ్యాప్ సాయంతో కారులో వెళ్తూ ప్రమాదం బారిన పడింది. ఈ ఘటన ముంబై (Mumbai) శివారులో చోటుచేసుకుంది.
ఓ మహిళ బేలాపూర్ (Belapur) నుంచి ఉల్వేకు కారులో బయల్దేరింది. ఆమెకు దారి తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించింది. అయితే, ఆమె బేలాపూర్‌లోని బే వంతెనపైకి వెళ్లాల్సి ఉండగా.. గూగుల్ మ్యాప్‌లో మరోదారి చూపించింది. వంతెన కింద ఉన్న ధ్రువతార జెట్టీకి వెళ్లే దారిని చూపించింది. గూగుల్ మ్యాప్స్ చూపించిన దారి గుండా వెళ్లిన ఆ మహిళ ప్రమాదవశాత్తూ కారుతో సహా ఓ నీటి గుంటలోకి పడిపోయింది. సమాచారం అందుకున్న మెరైన్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సదరు మహిళను ప్రాణాలతో రక్షించారు. కారును కూడా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read..
Bomb Threat | టెర్మినల్ 2 వద్ద బాంబు అమర్చాం.. ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వరుస బాంబు బెదిరింపులు
PM Modi | ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. అత్యంత విశ్వసనీయ నేతగా గుర్తింపు
IRCTC | రైళ్లలో ఆహార నాణ్యతపై 2024-25లో 6,645 ఫిర్యాదులు.. వెల్లడించిన రైల్వే శాఖ మంత్రి