Mirinda golgappa | ప్రస్తుతం మిరిండా గోల్గప్పా ట్రెండింగ్ నడుస్తోంది సోషల్ మీడియాలో. ఇప్పటికే పానీపూరీ ఐస్‌క్రీమ్ గురించి చదివాం. ఫాంటా మ్యాగీ గురించి చదివాం. యాపిల్ బజ్జీలు, ఫైర్ మోమో, ఓరియో పకోడా గురించి చదివాం.. ఇది మిరిండా గోల్గప్పా టైమ్.
మిరిండాతో గోల్‌గప్పాను జైపూర్‌లోని ఓస్ట్రీట్ వెండర్ తయారు చేస్తున్నాడు. పానీపూరీ రసం బదులు మిరిండానే జాడిలో పోసి దాని పానీపూరీలో పోసి అమ్ముతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను చటోరె బ్రదర్స్ అనే ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దాన్ని ఫుడ్ బ్లాగర్ టేస్ట్ చేసి ఫేస్‌ను ఒకరకంగా పెట్టాడు. దీంతో నెటిజన్లకు కూడా దాని టేస్ట్ అర్థం అయింది. ఏం పనిలేదా మీకు.. పనికిమాలిన ఫుడ్ చేస్తూ జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు.. అంటూ నెటిజన్లు ఆ వెరైటీ వంటకంపై ఫైర్ అవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Monkeys Kill Dogs | 250 కుక్కలను వేటాడి మరీ చంపేసిన కోతులు.. కారణం ఏంటో తెలుసా?