ఇల్లెందు : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పుట్టినరోజు ( KCR Birthday ) సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఇల్లెందు( Illendu ) పట్టణంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఉద్యమ నేత దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో శివాలయంలో ప్రత్యేక పూజలు, జగదాంబ సెంటర్లో కేక్ కటింగ్, ఇల్లెందు ప్రభుత్వాసుపత్రిలో రోగులకి పాలు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 72 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.

పాత బస్టాండ్ సెంటర్లో 72 కేజీల కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. కేసీఆర్ ప్రాణాలకు తెగించి తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టడం వల్లే తెలంగాణ సాధన సాధ్యం అయ్యిందని పేర్కొన్నారు. తెలంగాణను 10 సంవత్సరాలలో అభివృద్ధి చేసిన కారణజన్ముడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో టీజీబీకేఎస్ నాయకులు ఎస్ రంగనాథ్, పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ జబ్బర్, పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్లు,ఉపాధ్యక్షులు అబ్దుల్ నబీ, సీనియర్ నాయకులు సిలివేలు సత్యనారాయణ, అజ్మీర బావుసింగ్,మండల అధ్యక్షుడు శీలం రమేష్, బొమ్మర్ల వరప్రసాద్ గౌడ్, కంభంపాటి రేణుక, చీమల సత్యనారాయణ, బర్మావత్ లాల్ సింగ్ నాయక్, డేరంగుల పోశం, నెమలి ధనలక్ష్మి, కొక్కు సరిత, తాటి మౌనిక, సంతోషి పాసి, గోపాల్, స్థానిక నాయకులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.