కుభీర్/ నార్నూర్ : ఉమ్మడి ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ( KCR Birthday ) ఘనంగా జరిగాయి. నిర్మల్ జిల్లా కుభీర్ మండలకేంద్రంలో ని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్ ఆధ్వర్యంలో ఉద్యమ నాయకుడు పుప్పాల పీరాజీ, మండల నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ 14 ఏళ్ల సుదీర్ఘ రాష్ట్ర సాధన పోరాటంలో అలుపెరుగని ఉద్యమ వీరుడిగా, తెలంగాణ జాతిపితగా పేరు గడిచారని కొనియాడారు. పరిపాలన చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకు రోజుకో కేసుతో, ఈడి విచారణలతో పబ్బం గడుపుకుంటుందని మండిపడ్డారు. నాయకులు దొంతుల దేవిదాస్, జి కాశీనాథ్, గంధం పోశెట్టి, దత్తాత్రి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
నార్నూర్‌లో..

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద మైనార్టీ వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ యూనీస్ అక్బానీ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షుడు కనక సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు ఉర్వేత రూప్ దేవ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ తోడసం నాగోరావ్, మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాసిం, పట్టణ అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్, ఐటీడీఏ మాజీ డైరెక్టర్ మాడవి మాన్కు, నాయకులు రాథోడ్ సుభాష్, రాథోడ్ శివాజీ, మాజీ సర్పంచ్ మడవి రూప్ దేవ్, సుల్తాన్ ఖాన్ తదితరులున్నారు.