హైదరాబాద్, జూలై 31: గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు(జీసీసీ) అడ్డాగా హైదరాబాద్ మారిపోయిందని హైసియా అధ్యక్షుడు బిపిన్ పెంద్యాల అన్నారు. హైదరాబాద్‌లో హైసియా, 3ఏఐ సంయుక్తంగా జీసీసీఎక్స్ హైదరాబాద్ 2026 సదస్సును ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రపంచస్థాయి మౌలిక వసతులు, అనకూల పాలసీలు, ప్రతిభ కలిగిన ఉద్యోగులు లభిస్తుండటం, ఇన్నోవేషన్ రంగం కొత్త పుంతలు తొక్కుతుండటంతో జీసీసీలను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్‌ను తొలి ప్రాధాన్యతనిస్తున్నట్టు చెప్పారు. ఈ సదస్సుకు 1,200 మంది డెలిగేట్స్, 70 మంది స్పీకర్లు హాజరయ్యారు.