న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ రెండవ సెషన్ ఇవాళ ప్రారంభమైంది. లోక్సభ, రాజ్యసభలు ఇవాళ ఉదయం 11 గంటలకు కార్యక్రమాలు ప్రారంభించాయి. రాజ్యసభలో ఇవాళ వెంకయ్యనాయుడు దివంగత మాజీ సభ్యులకు నివాళి అర్పించారు. మాజీ సభ్యులు నబిన్ చంద్ర బుర్గోహెయిన్, రాహుల్ బజాజ్, డీపీ చటోపాధ్యాయ, యాడ్లపాటి వెంకట్ రావు మృతికి రాజ్యసభ నివాళి ప్రకటించింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై విదేశాంగ మంత్రి జైశంకర్ త్వరలో ప్రకటన చేయనున్నట్లు చైర్మెన్ వెంకయ్య తెలిపారు.