KTR | న్యూఢిల్లీ : ఢిల్లీ బీఆర్ఎస్ భవన్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఇక భవనంలోని ఓ అంతస్తులో అమ్మవారి విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి కేటీఆర్ ఫోటోలు దిగారు. పలువురు నాయకులు కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకున్నారు.