Asaduddin Owaisi | హైదరాబాద్ : ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత బాబా సిద్ధిఖీ మృతిపట్ల ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఇద్దరు ఒకే రోజు మృతి చెందడం బాధాకరమన్నారు.
బాబా సిద్ధిఖీ హత్య ఖండించదగినది అని ఒవైసీ పేర్కొన్నారు. ఈ హత్య మహారాష్ట్రలో క్షీణిస్తున్న శాంతిభద్రతలను ప్రతిబింబిస్తుంది. ప్రొఫెసర్ సాయిబాబా మరణం కూడా తీవ్ర ఆందోళనను కలిగిస్తుందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సాయిబాబాను సుదీర్ఘకాలం జైల్లో ఉంచడం కూడా ఆయన మరణానికి కారణమని ఒవైసీ పేర్కొన్నారు.
Truly devastating news of two deaths on the same day.
Baba Siddique’s murder is highly condemnable. It reflects the deteriorating state of law & order in Maharashtra. May Allah grant him maghfirah. My condolences to his family, friends & colleagues.
Prof. Saibaba’s death is…
— Asaduddin Owaisi (@asadowaisi) October 12, 2024
ఇవి కూడా చదవండి..
Baba Siddique | మహారాష్ట్రలో దారుణం.. ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య
GN Saibaba | ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూత
India vs Bangladesh | బంగ్లాపై భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్