India vs Bangladesh | పసికూన బంగ్లాపై భారత్ ఘనవిజయం సాధించింది. ఉప్పల్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో యువ భారత్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థిని 133 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. చివరి టీ20లోనూ ఘన విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. 298 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లా బోల్తా కొట్టింది. లిటన్‌దాస్ (42), హిర్దోయ్ (63*) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, సంజూ శాంసన్‌తో కలిసి ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే సంజూ మొదటి నుంచి దూకుడుగా ఆడడంతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. కేవలం 47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 111 పరుగులతో జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందించాడు. మరోవైపు సూర్య కుమార్ యాదవ్ కూడా 35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో 20 ఓవర్లలో భారత్ 6 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. అయితే 298 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. లిటన్‌దాస్ (42), హిర్దోయ్ (63*) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. భారత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 3, మయాంక్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్, నితీశ్ రెడ్డి చెరో వికెట్ తీశారు.
𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎!
Congratulations to #TeamIndia on winning the #INDvBAN T20I series 3⃣-0⃣ 👏👏
Scorecard – https://t.co/ldfcwtHGSC@IDFCFIRSTBank pic.twitter.com/npNJ2jmryU
— BCCI (@BCCI) October 12, 2024