Baba Siddique | మహారాష్ట్రలో దారుణం.. ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య
Baba Siddique | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా, గుర్తు తెలియని ముగ్గురు దుండగులు సిద్ధిఖీపై మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు.
Baba Siddique | ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా, గుర్తు తెలియని ముగ్గురు దుండగులు సిద్ధిఖీపై మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు.
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, కుటుంబ సభ్యులు.. హుటాహుటిన ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సిద్ధిఖీ కన్నుమూశారు. అయితే కాల్పులకు పాల్పడ్డ వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాదాపు ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సిద్ధిఖీ కొన్ని నెలల కిందటే ఎన్సీపీలో చేరారు.
మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కాల్పులు జరగడం గమనార్హం. సిద్దిఖీ 1999, 2004, 2009 ఎన్నికల్లో బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009లో రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు లభించింది. ప్రజా సేవ చేయడంతో పాటు గ్రాండ్‌గా పార్టీలు నిర్వహిస్తారనే పేరు సిద్ధిఖీకి ఉంది. 2013లో సిద్ధిఖీ నిర్వహించిన ఇఫ్తార్ విందులో బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. అప్పట్లో వీరిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయి. ఈ పార్టీలోనే సిద్ధిఖీ ఆ ఇద్దరు స్టార్స్‌ను దగ్గరకు చేర్చి గొడవలకు పుల్‌స్టాప్ పెట్టించారు.
ఇవి కూడా చదవండి..
India vs Bangladesh | బంగ్లాపై భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
GN Saibaba | ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూత
Nani Odela2 | దసరా దర్శకుడితో కొత్త సినిమా ప్రారంభించిన నాని
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

