PM Modi | గగన్‌యాన్‌కు మైలురాయిగా నిలుస్తుంది.. శుభాన్షు రాకపై ప్రధాని మోదీ హర్షం
PM Modi | భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) క్షేమంగా భూమికి తిరిగి రావడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
PM Modi | యాక్సియమ్-4 (Ax-4) మిషన్ విజయవంతమైంది. దాదాపు 18 రోజులపాటూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన భారత వ్యోమగామి శుభాన్షు బృందం ఇవాళ భూమికి తిరిగొచ్చింది. ఈ సందర్భంగా శుభాన్షు బృందం క్షేమంగా భూమికి తిరిగి రావడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామిగా శుభాన్షు చరిత్ర సృష్టించారు. ఆయన చూపిన పట్టుదల, అంకితభావం, సాహస చర్యల వల్ల కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఈ చారిత్రాత్మక యాత్ర భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌కు (Gaganyaan mission) మైలురాయిగా నిలుస్తుంది’ అని ప్రధాని పేర్కొన్నారు.
I join the nation in welcoming Group Captain Shubhanshu Shukla as he returns to Earth from his historic mission to Space. As India’s first astronaut to have visited International Space Station, he has inspired a billion dreams through his dedication, courage and pioneering…
— Narendra Modi (@narendramodi) July 15, 2025
భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష ప్రయాణం ముగిసింది. దాదాపు 18 రోజులపాటూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన శుభాన్షు బృందం ఇవాళ క్షేమంగా భూమికి చేరుకున్న విషయం తెలిసిందే. వీరు ప్రయాణిస్తున్న స్పేస్‌క్రాఫ్ట్ ఇవాళ మధ్యాహ్నం 3:01 గంటల సమయంలో అమెరికా కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర జలాల్లో ల్యాండ్ అయ్యింది. అనంతరం అక్కడే ఉన్న సిబ్బంది వారి వద్దకు చేరుకొని నౌకలోకి తీసుకొచ్చారు. ఇక భూమికి చేరుకున్న వ్యోమగాములు ఏడు రోజుల పాటూ క్వారంటైన్లో ఉండనున్నారు. ఇస్రోకు చెందిన ఫ్లైట్ సర్జన్లు వారం రోజుల పాటూ వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్నెస్ను నిరంతరం పర్యవేక్షిస్తారు.
Also Read..
“Shubhanshu Shukla | డ్రాగన్ క్యాప్సూల్ నుంచి బయటకొచ్చిన శుభాన్షు శుక్లా.. తొలి ఫొటో”
“Shubhanshu Shukla | వెల్‌కమ్‌బ్యాక్.. క్షేమంగా భూమికి చేరుకున్న శుభాన్షు బృందం”
Shubhanshu Shukla: అంతరిక్షంలో హెయిర్ కటింగ్ చేయించుకున్న శుభాన్షు శుక్లా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

