గురుగ్రామ్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. రోజురోజుకూ కొత్త కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా లాక్డౌన్ విధిస్తారేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందుకే బతుకుదెరువు కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన వలసకార్మికులు.. మూటాముల్లె సర్దుకుని స్వస్థలాలకు తిరుగు పయనం అవుతున్నారు.
దాంతో ప్రధాన నగరాల్లోని బస్‌స్టాపులు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏ క్షణంలో అయినా లాక్డౌన్ ప్రకటించవచ్చు. అందుకే తాము స్వస్థలాలకు వెళ్తున్నాం. గత ఏడాది లాక్డౌన్ సందర్భంగానే తాము చాలా ఇబ్బందులు పడ్డాం. ఈసారి కూడా అలాంటి సమస్యలను ఎదుర్కొదల్చుకోలేదు అని ప్రయాణికులు చెబుతున్నారు.
Haryana: Migrant workers in Gurugram were seen leaving for their native places, amid increasing #COVID19 cases.
— ANI (@ANI) April 18, 2021
"There are chances of lockdown so I am going home. I faced problems due to lockdown last year, want to avoid any such situation again," says a worker. pic.twitter.com/D2Ftrd38Cb
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
బద్రీనాథ్ ఆలయంపై మల్లెలు చల్లినట్లుగా మంచు వర్షం.. వీడియో
కమలా హారిస్‌ను చంపేస్తామని బెదిరింపులు.. నర్సు అరెస్ట్
ప్రముఖ సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ కన్నుమూత.. ప్రధాని సంతాపం
మార్కెట్లో కొనితెచ్చిన పాలకూరలో పాముపిల్ల.. వీడియో
వీళ్లు కేరళ జాతిరత్నాలు.. వీళ్ల నటన అమోఘం.. వీడియో