e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home News పాల‌కూర ప్యాకెట్‌లో పాముపిల్ల‌.. వీడియో

పాల‌కూర ప్యాకెట్‌లో పాముపిల్ల‌.. వీడియో

పాల‌కూర ప్యాకెట్‌లో పాముపిల్ల‌.. వీడియో


సిడ్నీ: ‌సూప‌ర్ మార్కెట్ నుంచి కొని తెచ్చిన పాల‌కూర‌లో ఒక్క‌సారిగా పాముపిల్ల ప్ర‌త్య‌క్షం కావ‌డంతో ఆస్ట్రేలియాకు చెందిన భార్యాభ‌ర్త‌లు షాక‌య్యారు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ వైట్‌, అమేలియా నీట్ ఇద్ద‌రూ భార్యాభ‌ర్త‌లు. ఇటీవ‌ల ఇద్ద‌రూ క‌లిసి ఇంటి స‌రుకుల కోసం సూప‌ర్ మార్కెట్‌కు వెళ్లారు. అక్క‌డి నుంచి నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌తోపాటు కూర‌గాయ‌లు, కొన్ని ఆకు కూర‌లు కూడా కొని తెచ్చుకున్నారు.

ఇంటికి చేరుకున్న త‌ర్వాత కూర‌గాయ‌ల‌ను స‌ర్దుతుండ‌గా పాల‌కూర ప్యాకెట్‌లో పాము పిల్ల క‌నిపించింది. దాంతో ఆ దంప‌తులిద్ద‌రూ షాక‌య్యారు. ఆ త‌ర్వాత షాక్ నుంచి తేరుకుని వైల్డ్ లైఫ్ అధికారుల‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సూప‌ర్ మార్కెట్ యాజ‌మాన్యంపై పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేశారు. త‌ర్వాత అలెక్స్ వైట్ పాల‌కూర‌ ప్యాకెట్‌లో క‌ద‌లాడుతున్న పాము పిల్ల‌ను వీడియో తీశాడు. దాన్ని సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డంతో వైర‌ల్‌గా మారింది.

అలెక్స్ వైట్ ఇచ్చిన స‌మాచారం మేర‌కు అత‌ని ఇంటి చేరుకున్న వైల్డ్ లైఫ్ అధికారులు ఆ పాము పిల్ల‌ను ప‌ట్టుకుని తీసుకెళ్లారు. కేవ‌లం 7.8 అంగుళాల పొడ‌వున్న ఆ పాము పిల్ల చాలా విష‌పూరిత‌మైన‌దని అధికారులు తెలిపారు. దాంతో అలెక్స్ దంప‌తులు తాము ఏ మాత్రం అజాగ్ర‌త్త‌గా పాల‌కూర ప్యాకెట్‌ను తెరిచినా పాముకాటుకు బ‌లైపోయేవాళ్ల‌మ‌ని ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. కాగా, సోషల్ మీడియాలో అలెక్స్ పోస్ట్ చేసిన వీడియో వైర‌ల్‌గా మార‌డంతో నెటిజ‌న్‌లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

క‌రోనా విల‌య‌తాండవం.. ఒక్క‌రోజులోనే 2,34,692 పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో కొత్త‌గా 4446 క‌రోనా కేసులు

న‌టుడు సోనూసూద్‌కు క‌రోనా పాజిటివ్

వ్యాధినిరోధ‌క శ‌క్తిని పెంచే ఈ ఆహార ప‌దార్థాల గురించి తెలుసా..?

కోవిడ్‌పై పోరాటానికి కుంభ‌మేళా ఓ ప్ర‌తీక‌గా నిల‌వాలి : ప్ర‌ధాని మోదీ

వాముతో ఎన్ని లాభాలో తెలుసా..?

కోడిగుడ్డులో ప‌చ్చ‌సొన‌ను ప‌డేస్తున్నారా.. అయితే ఇది చ‌ద‌వాల్సిందే..!

పాదాల ప‌గుళ్లు పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!

Advertisement
పాల‌కూర ప్యాకెట్‌లో పాముపిల్ల‌.. వీడియో
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement