శుక్రవారం 22 జనవరి 2021
National - Nov 25, 2020 , 17:18:15

కోవిడ్ నిఘా.. డిసెంబ‌ర్ ఒక‌టి నుంచి కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు

కోవిడ్ నిఘా.. డిసెంబ‌ర్ ఒక‌టి నుంచి కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో డిసెంబ‌ర్ ఒక‌టి నుంచి కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు అమ‌లులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన కేంద్రం కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను వెల్ల‌డించింది.  అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోవిడ్ నియంత్ర‌ణ‌కు సంబంధించిన నియ‌మావ‌ళిని పాటించాల‌ని ఆ మార్గ‌ద‌ర్శ‌కాల్లో స్ప‌ష్టం చేసింది. కేంద్ర హోంశాఖ దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్‌ను రిలీజ్ చేసింది. కంటేన్మెంట్ జోన్ల‌లో క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేయ‌నున్నారు.  కోవిడ్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని క‌చ్చితంగా పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.  కంటోన్మెంట్ జోన్ల‌లో కేవ‌లం అత్య‌వ‌స‌ర కార్య‌క్ర‌మాల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చారు. కంటోన్మెంట్ లేని జోన్ల‌లో లాక్‌డౌన్ విధించ‌రాదు అని రాష్ట్రాల‌కు కేంద్రం ఆదేశించింది.   

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో నిఘా పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేంద్ర హోంశాఖ చెప్పింది.  పాజిటివ్ తేలిన కేసుల‌కు సంబంధించిన కాంటాక్ట్ లిస్టింగ్ చేయాల‌ని సూచించింది.  ట్రాకింగ్‌, ఐడెంటిఫికేష‌న్‌, క్వారెంటైన్ చేయాల‌న్న‌ది.  72 గంట‌ల్లోనే 80 శాతం కాంటాక్ట్‌ల‌ను ట్రేస్ చేయాల‌న్న‌ది.  ఇటీవ‌ల కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరిగిన నేప‌థ్యంలో.. క‌ఠిన‌మైన కంటోన్మెంట్ ఆంక్ష‌ల‌ను పాటించాల‌న్న‌ది. డిసెంబ‌ర్ ఒక‌టి నుంచి డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ఈ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు అమ‌లులో ఉంటాయ‌ని కేంద్ర హోంశాఖ త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.   

కంటోన్మెంట్ జోన్ల నుంచి ఎవ‌రూ బ‌య‌ట‌కు రాకుండ ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్రం సూచించింది. అత్య‌వ‌స‌ర వైద్యం, స‌ర‌కుల ర‌వాణా కోసం కంటోన్మెంట్ జోన్లకు ప‌రిమితి స్థాయిలో అనుమ‌తి క‌ల్పించారు.  ప్రోటోకాల్ ప్ర‌కారం టెస్టింగ్ నిర్వ‌హించాల‌న్న‌ది.  స్థానిక జిల్లా, మున్సిప‌ల్ పోలీసులు అధికారులు.. క‌ఠినంగా ఆంక్ష‌లు అమ‌లు అయ్యేలా చూడాల‌ని కేంద్రం త‌న మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొన్న‌ది.  


logo