Mehbooba Mufti | ‘ఇండియా’ బ్లాక్‌కు ముఫ్తీ షాక్.. కశ్మీర్లో మూడు లోక్‌సభ స్థానాల్లో పీడీపీ పోటీ
Mehbooba Mufti | జమ్ముకశ్మీర్‌కు చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌కు షాక్ ఇచ్చారు. కశ్మీర్‌లోని మూడు లోక్‌సభ స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని బుధవారం ప్రకటించారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌కు చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌కు షాక్ ఇచ్చారు. కశ్మీర్‌లోని మూడు లోక్‌సభ స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని బుధవారం ప్రకటించారు. సీట్ల పంపిణీకి సహకరించలేదని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లాను ఆమె నిందించారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేయడం తప్ప పీడీపీకి మరో మార్గం లేదని అన్నారు.
కాగా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ నిర్ణయంపై ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా స్పందించారు. సొంత అభ్యర్థులను పోటీకి దించుతున్న ఆమె బహుశా ఎలాంటి పొత్తు కోరుకోవడం లేదని విమర్శించారు. మొత్తం 5 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలనుకుంటే అది ఆమె ఇష్టమని అన్నారు. ముఫ్తీ ఫార్ములా ఆధారంగానే తాము కశ్మీర్‌లోని మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు తెలిపారు. ‘ఇండియా’ కూటమి సీట్ల పంపిణీలో భాగంగా జమ్ములోని రెండు స్థానాలను కాంగ్రెస్‌కు వదిలిపెట్టినట్లు చెప్పారు.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎలాంటి పొత్తు అక్కర్లేదని మెహబూబా ముఫ్తీ భావిస్తున్నట్లుగా తెలుస్తున్నదని ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. ‘మేం తలుపులు తెరిచి ఉంచాం. ఇప్పుడు ఆమె మూసి వేస్తే అది మా తప్పు కాదు’ అని మీడియాతో అన్నారు.
#WATCH | National Conference leader Omar Abdullah says, "…If she (PDP chief Mehbooba Mufti) has announced to field candidates on all 5 seats, it is her choice. We have fielded candidates on 3 seats in Kashmir based on her formula…If she is fielding her own candidates then… pic.twitter.com/EZJCeuU2LF
— ANI (@ANI) April 3, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

