Snowfall | బండిపొరలో భారీగా కురుస్తున్న హిమపాతం.. వీడియో
దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. పెరిగిన ఉష్ణోగ్రతలకు వడగాలులు తోడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే భూతల స్వర్గం జమ్ముకశ్మీర్లో (Jammu and Kashmir) మాత్రం పరిస్థితులు మరోలా ఉన్నాయి.
శ్రీనగర్: దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. పెరిగిన ఉష్ణోగ్రతలకు వడగాలులు తోడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే భూతల స్వర్గం జమ్ముకశ్మీర్లో (Jammu and Kashmir) మాత్రం పరిస్థితులు మరోలా ఉన్నాయి. బండిపొర జిల్లాతోపాటు కుప్వారాలోని మాచిల్ సెక్టార్లో హిమపాతం (Snowfall) కురుస్తున్నది. రహదారులను దట్టంగా మంచు కప్పేసింది.
భారీ హిమపాతం కారణంగా రోడ్లపైకి వాహనాలు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మంచును రహదారులపై నుంచి తొలగించి రాకపోకలకు సిద్ధం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్లపై భారీగా పేరుకుపోయిన మంచును యంత్రాల సహాయంతో తొలగిస్తున్నారు.

#WATCH | J&K: Bandipora district of North Kashmir received fresh snowfall today. pic.twitter.com/GYJkMLcsoi
— ANI (@ANI) April 29, 2024
#WATCH | Kupwara, J&K: Machil sector of Kupwara receives fresh snowfall. pic.twitter.com/kZdHOFYl3f
— ANI (@ANI) April 29, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

