మోదీకి తానే గొప్పోడినన్న ఫీలింగ్
ప్రపంచంలో తనకంటే గొప్పోడు ఎవరూ లేరని, తానే అందరికంటే గొప్పోడినన్న ఫీలింగ్‌లో ప్రధాని మోదీ ఉంటారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. ఆయనను విమర్శిస్తే అస్సలు తట్టుకోలేరని తెలిపారు. అంతేకాదు.. ఎవర్నీ అభినందించటానికి ఇష్టపడరని, అది ఆయన వ్యక్తిత్వమే కాదని వ్యాఖ్యానించారు
- విమర్శలను అస్సలు తట్టుకోలేరు
- మేఘాలయ గవర్నర్ సత్యపాల్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ప్రపంచంలో తనకంటే గొప్పోడు ఎవరూ లేరని, తానే అందరికంటే గొప్పోడినన్న ఫీలింగ్‌లో ప్రధాని మోదీ ఉంటారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. ఆయనను విమర్శిస్తే అస్సలు తట్టుకోలేరని తెలిపారు. అంతేకాదు.. ఎవర్నీ అభినందించటానికి ఇష్టపడరని, అది ఆయన వ్యక్తిత్వమే కాదని వ్యాఖ్యానించారు. పలు సందర్భాల్లో ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెట్టిన సత్యపాల్ మాలిక్ త్వరలో పదవీ విరమణ చేయబోతున్నారు.
ఈ సందర్భంగా ఆయనను ‘ది వైర్’ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహావిష్కరణలో చోటుచేసుకొన్న సందర్భాన్ని గుర్తుచేస్తూ.. విగ్రహాన్ని ఆవిష్కరించే సమయంలో చాపర్‌లో తానొక్కడినే ఉండాలని, కెమెరాల్లో తాను మాత్రమే కనిపించాలని మోదీ ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. పదవీ విమరణ అనంతరం రైతులకు మద్దతు ధర కల్పించేలా పోరాటం చేస్తానని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

