Lok Sabha Speaker : పార్లమెంట్ సమావేశాల ముందు తదుపరి లోక్సభ స్పీకర్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం సాయంత్రం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో మంత్రుల సమావేశం జరగనుంది. జూన్ 24న లోక్సభ స్పీకర్ ఎన్నిక కోసం లోక్సభ సమావేశాలు జరగనుండగా అంతకుముందు జరుగుతున్న ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
స్పీకర్ ఎన్నికతో పాటు పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీయే పక్షాల మధ్య మెరుగైన సమన్వయం సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపైనా ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. లోక్సభ స్పీకర్ పదవిని ఎన్డీయే కీలక భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీ(యూ) ఆశిస్తున్నాయి. లోక్సభ స్పీకర్గా ఎవరివైపు ఎన్డీయే మొగ్గుచూపుతుందనే విషయంలో ఈ సమావేశం అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
స్పీకర్ పదవిపై ఎన్డీయే పక్షాలతో పాటు విపక్షాల నుంచి ఏకాబిప్రాయాన్ని సాధించే బాధ్యతను బీజేపీ అగ్రనాయకత్వం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు అప్పగించింది. జూన్ 26న స్పీకర్ ఎన్నిక జరగనుండటంతో ఆనవాయితీ ప్రకారం తమకు డిప్యూటీ స్పీకర్ను కేటాయించని పక్షంలో స్పీకర్ పదవికి అభ్యర్ధిని నిలిపేందుకు విపక్ష ఇండియా కూటమి సంసిద్ధమైందని చెబుతున్నారు. ఇక బీజేపీ ఎంపీ ఓం బిర్లా ప్రస్తుతం లోక్సభ స్పీకర్గా వ్యవహరిస్తున్నారు.
Read More :