బద్రీనాథ్‌లోనూ భారీగా విరాళాల చోరీ
ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలోని పవిత్ర బద్రీనాథ్ ధామ్‌లో విరాళాల అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) తన దర్యాప్తును వేగవంతం చేసింది.
- సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తింపు
- మాజీ అధికారి అరెస్ట్
న్యూఢిల్లీ, జూలై 18: ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలోని పవిత్ర బద్రీనాథ్ ధామ్‌లో విరాళాల అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) తన దర్యాప్తును వేగవంతం చేసింది. తాజాగా బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) మాజీ అధికారి, విరాళాల లెక్కింపు మాజీ ఇన్చార్జి రాజేంద్ర సింగ్ చౌహాన్‌ను సిట్ అరెస్ట్ చేసింది. జోషిమఠ్‌లోని న్యాయస్థానం ముందు శనివారం అతడిని హాజరుపర్చగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
ఆలయ సీసీ ఫుటేజ్‌లు పరిశీలించిన దర్యాప్తు బృందానికి విరాళాల నిర్వహణ వ్యవస్థపై పలు సందేహాలు తలెత్తాయి. లభ్యమైన 13 రోజల ఫుటేజ్‌ను సిట్ పరిశీలించగా ప్రతి రోజు కట్టల కట్టల కరెన్సీ, బంగారం, వెండిని కొందరు అపహరిస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి.
ఇంకా 32 రోజుల సీసీటీవీ ఫుటేజ్ అదృశ్యమైనట్టు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా నిందితుని వద్ద నుంచి కుంకుమ పువ్వు, ఇతర వస్తువులు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణానికి బదులు బ్యాంక్ ప్రాంగణంలో విరాళాలను లెక్కించారన్న ఆరోపణలపై కూడా సిట్ దర్యాప్తు చేస్తున్నది. దీనిలో బ్యాంక్ అధికారుల పాత్ర గురించి ఆరా తీస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

