Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur Violence)లో తాజాగా మరోసారి హింస చెలరేగింది. రాజధాని ఇంపాల్ (Imphal)లో మంగళవారం వందలాది మంది విద్యార్థులు (Manipur Students) నిరసన చేపట్టారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు విద్యార్థులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
మణిపూర్‌లో ఈ ఏడాది జూలైలో ఆచూకీ లేకుండా పోయిన మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయినట్లు ఫొటోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆగ్రహించిన రాష్ట్రంలోని విద్యార్థులు ఘటనకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విద్యార్థులంతా ముఖ్యమంత్రి ఎన్ బీరెన్‌సింగ్ (N Biren Singh) నివాసం వైపు కవాతు చేసేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు విద్యార్థులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
#ManipurViolence: Reacting to the #viralphotos of the #bodies, suspected to be of the two #missing #Meetei students, students in #Imphal city erupted into #agitation today. Students of CC Higher Secondary School and TG. Higher Secondary #School and others took to the streets in… pic.twitter.com/qPHQKbjiyv
— Ukhrul Times (@ukhrultimes) September 26, 2023
A large number of students gathered and staged a demonstration in Imphal seeking justice for the brutal killing of the two Meitei students, who went missing on 6 July.#Manipur #imphal #ManipurViolence #ManipurFightsBack #Meiteis #Kukis #nenewslive pic.twitter.com/HvCZksZEK6
— nenewslive (@NENEWS24x7) September 26, 2023
Students protest against Chin-Kuki Terrorists who tortured and killed two Meetei Studentsp, Phijam Hemjit and Hijam Linthoingambi, who went missing on July 6, 2023, and were later killed.#StudentProtests #manipurconflict #studentkilling #imphal #manipurcrisis pic.twitter.com/5RYoFSS7Ft
— Neljit Ngangkham (@NgangkhamTombi) September 26, 2023
మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు (Manipur Students) శవమై తేలారు. జూలైలో ఆచూకీలేకుండా పోయిన ఇద్దరు విద్యార్థుల ఫోటోలు రిలీజ్ అయ్యాయి. అయితే ఆ ఇద్దరి మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. 17 ఏళ్ల హిజామ్ లింతోయింగంబి, 20 ఏళ్ల ఫిజమ్ హేమ్‌జిత్ .. సాయుధుల మధ్య ఉన్న ఫోటోలను రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ చనిపోయినట్లు ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఓ జంగిల్ క్యాంపు వద్ద ఆ ఇద్దరూ హతమైనట్లు తెలుస్తోంది. జూలై నుంచి అదృశ్యమైన ఆ ఇద్దరు విద్యార్థుల కోసం గాలింపు జరుగుతోంది. ఈ కేసును సీబీఐ విచారిస్తున్నది.
కాగా, కుకీ, మెయిటీ కమ్యూనిటీల మధ్య నెలకొన్న ఘర్షణలతో దాదాపు నాలుగు నెలలుగా మణిపూర్ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈశాన్య రాష్ట్రంలో నెలకొన్న జాత్యహంకార ఘర్షణలను చల్లార్చేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. అయినప్పటికీ శాంతి నెలకొనలేదు సరికదా రోజురోజుకూ ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత క్షీణించాయి. ఇప్పటికీ కొందరు అల్లరి మూకలు, నిషేధిత ఉగ్రవాదులు అక్కడక్కడా దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో హింస చెలరేగినప్పటి నుంచి ఇప్పటి వరకూ 175 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,118 మంది గాయపడ్డారు. సుమారు 33 మంది అదృశ్యమయ్యారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులు కొంతమేర అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇటీవలే ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించింది. దీంతో రాష్ట్రంలో అల్లర్లు మొదలైన తర్వాత జూలై నెలలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్లు ఉన్న ఫొటోలు ఇంటర్నెట్లో దర్శనమిచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ ఘటనకు నిరసనగా వందలాది విద్యార్థులు నిరసన చేపట్టారు.
Students continues protest against killing of two students , as peaceful rally was stopped by Manipur Police,RAF . Students sit in protest followed by slogans was staged #StudentProtests #manipurconflict #studentkilling #imphal #ManipurCrisis pic.twitter.com/I4K3AskL0Y
— Neljit Ngangkham (@NgangkhamTombi) September 26, 2023
Also Read..
India-Canada | ఢిల్లీ పర్యటనలో ట్రూడో ఫ్లైట్ నిండా కొకైనే.. మాజీ దౌత్యవేత్త సంచలన ఆరోపణలు
Anand Mahindra | ఆనంద్ మహీంద్రాపై చీటింగ్ కేసు నమోదు
India-Canada | తీవ్రవాదులకు అడ్డాగా మారిన కెనడా.. భారత్‌కు మద్దతుగా నిలిచిన శ్రీలంక