India-Canada | ఢిల్లీ పర్యటనలో ట్రూడో ఫ్లైట్ నిండా కొకైనే.. మాజీ దౌత్యవేత్త సంచలన ఆరోపణలు
India-Canada | కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) పై భారత మాజీ దౌత్యవేత్త దీపక్ వోహ్రా (Deepak Vohra) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే భారత్లో నిర్వహించిన జీ20 సదస్సుకు ఢిల్లీకి వచ్చిన ట్రూడో ఆ సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్నారని, ఆయన ఫ్లైట్ నిండా కొకైన్ నిండి ఉందని (plane was full of cocaine) ఆరోపించారు.
India-Canada | ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani Terrorist) హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ట్రూడో ఆరోపణలతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ట్రూడోపై భారత మాజీ దౌత్యవేత్త దీపక్ వోహ్రా (Deepak Vohra) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవలే భారత్లో నిర్వహించిన జీ20 సదస్సుకు ఢిల్లీకి వచ్చిన ట్రూడో ఆ సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్నారని, ఆయన ఫ్లైట్ నిండా కొకైన్ నిండి ఉందని (plane was full of cocaine) ఆరోపించారు. ‘ఢిల్లీకి వచ్చిన సమయంలో ట్రూడో డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు తెలిసింది. ఆయన ఫ్లైట్ నిండా కొకైన్ ఉన్నట్లు మన దేశ (భారత) స్నిఫర్ డాగ్స్ గుర్తించాయి. ట్రూడో రెండు రోజుల పాటు తన హోటల్ గది నుంచి బయటకు రాలేదు. అందుకే జీ20 కార్యక్రమాలకు కూడా హాజరుకాలేదు’ అంటూ దీపక్ వోహ్రా ఆరోపించారు. భారత్ పర్యటనలో ట్రూడో ప్రవర్తన కూడా భిన్నంగా ఉందని ఆయన అన్నారు. హుందాగా వ్యవహరించలేదని, పెద్దగా ఏదేశాధినేతతోనూ కలవలేదని గుర్తు చేశారు. ఢిల్లీ ఎయిర్పోర్టుకు వచ్చినప్పుడు కూడా ట్రూడో ప్రవర్తన సరిగా లేదని తన భార్య గమనించిందని వోహ్రా వివరించారు.
Also Read..
India-Canada | తీవ్రవాదులకు అడ్డాగా మారిన కెనడా.. భారత్కు మద్దతుగా నిలిచిన శ్రీలంక
Viral News | యువకుడిలా కనిపించేందుకు రోజూ 111 మాత్రలు.. రూ.16 కోట్లు ఖర్చు చేస్తున్న మిలియనీర్
Armenia | గ్యాస్ స్టేషన్లో భారీ పేలుడు.. 20 మంది మృతి.. 300 మందికి గాయాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

