India-Canada | ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani Terrorist) హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ట్రూడో ఆరోపణలతో భారత్-కెనడా (India-Canada) మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంలో పొరుగు దేశమైన శ్రీలంక (Sri Lanka) భారత్కు మద్దతుగా నిలిచింది. ఈ మేరకు కెనడా ప్రధాని ట్రూడోపై ఆ దేశ విదేశాంగ మంత్రి అలీ సబ్రీ (Ali Sabry) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్రూడో ఏ విధమైన ఆధారాలూ ఇవ్వకుండా దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
‘కొంతమంది తీవ్రవాదులు కెనడాలో సురక్షిత స్థావరాన్ని ఏర్పరుచుకున్నారు. ఎటువంటి ఆధారాలూ లేకుండా కొన్ని దారుణమైన ఆరోపణలతో కెనడా ప్రధాని ముందుకొచ్చినట్లు అనిపిస్తోంది. గతంలో మాపై (శ్రీలంక) కూడా వారు ఇలాంటి ఆరోపణలే చేశారు. శ్రీలంకలో మారణహోమం జరిగిందన్నది భయంకరమైన అబద్ధం. మా దేశంలో మారణహోమం జరగలేదని అందరికీ తెలుసు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలతో కలసి పోరాడిన వ్యక్తికి కెనడాలో సాదర స్వాగతం లభించడాన్ని చూశాను. ఇది నిజంగా ప్రశ్నించదగినది. కొన్ని సందర్భాల్లో ట్రూడో నిరాధార, దారుణ ఆరోపణలు చేయడం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు’ అంటూ వ్యాఖ్యానించారు.
Also Read..
Manpreet Singh Badal | ఆస్తి కొనుగోలు కేసులో బీజేపీ నేతకు లుకౌట్ నోటీసులు జారీ
Viral News | యువకుడిలా కనిపించేందుకు రోజూ 111 మాత్రలు.. రూ.16 కోట్లు ఖర్చు చేస్తున్న మిలియనీర్
Travel advisory | కెనడియన్లు జర భద్రం.. భారత్లో ఉన్న తమ పౌరులకు కెనడా ట్రావెల్ అడ్వైజరీ