Manpreet Singh Badal | ఆస్తి కొనుగోలు కేసులో పంజాబ్ మాజీ ఆర్థికమంత్రి, బీజేపీ నేత మన్‌ప్రీత్ సింగ్ బాదల్ (Manpreet Singh Badal )పై పంజాబ్ విజిలెన్స్ బ్యూరో (Punjab Vigilance Bureau) మంగళవారం లుకౌట్ నోటీసులు (Lookout notice ) జారీ చేసింది. ఈ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు బాదల్ దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని ఎయిర్‌పోర్ట్స్‌ను అప్రమత్తం చేశారు.
బటిండా (Bathinda) ఆస్తుల కొనుగోళ్లలో బాదల్ అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు బాదల్ సహా మరో ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు బాదల్‌తోపాటు గతంలో బటిండా డెవలప్మెంట్ అథారిటీ (బీడీఏ) చీఫ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన బిక్రంజీత్ షేర్గిల్, రాజీవ్ కుమార్, అమన్‌దీప్ సింగ్, వికాశ్ అరోరా, పంకజ్ లకు మంగళవారం నోటీసులు జారీ చేశారు.
Also Read..
Ayodhya Ram Temple | శరవేగంగా రామ మందిర నిర్మాణం.. డిసెంబర్ చివరికల్లా పనులు పూర్తి
Viral News | యువకుడిలా కనిపించేందుకు రోజూ 111 మాత్రలు.. రూ.16 కోట్లు ఖర్చు చేస్తున్న మిలియనీర్
Parineeti-Raghav Chadha | పెళ్లిలో పరిణీతి-రాఘవ్ డ్యాన్స్.. ఫన్నీ వీడియో