Parineeti-Raghav Chadha | బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) వివాహం ఆదివారం అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్‌పూర్ (Udaipur)లోని లీలా ప్యాలెస్ (Leela Palace)లో పంజాబీ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను పరిణీతి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా పెళ్లికి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వేడుకలో భాగంగా రాఘవ్-పరిణీతి ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసి అతిథులను ఉత్సాహపరిచారు. ఇందుకు సంబంధించిన ఫన్నీ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Also Read..
Manipur Students: మిస్సైన మణిపూర్ విద్యార్థుల హత్య.. ఫోటోలు రిలీజ్
SBI | మూడు బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. నిబంధనలు ఉల్లంఘించిన ఎస్బీఐకి 1.3 కోట్ల జరిమానా