Armenia | గ్యాస్ స్టేషన్లో భారీ పేలుడు.. 20 మంది మృతి.. 300 మందికి గాయాలు
Armenia | అర్మేనియా (Armenia)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ స్టేషన్లో పేలుడు (fuel depot blast ) సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Armenia | అర్మేనియా (Armenia)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ స్టేషన్లో పేలుడు (fuel depot blast ) సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటన నాగర్నో-కారాబఖ్ (Nagorno-Karabakh) ప్రాంతంలో మంగళవారం చోటు చేసుకుంది.
కాగా, నాగర్నో-కారాబఖ్ (Nagorno-Karabakh) ప్రాంతంలో అర్మేనియా సైనికుల (Armenian Forces)పై అజర్బైజాన్ సైన్యం (Azerbaijan Military) గత కొన్ని రోజులుగా దాడులకు పాల్పడుతోంది. మూడు దశాబ్దాల వేర్పాటువాద పాలన తరువాత అజర్బైజాన్ సైన్యం ఈ ప్రాంతాన్ని పూర్తిగా తిరిగి స్వాధీనం చేసుకునేందుకు వేగవంతమైన ఆపరేషన్ ప్రారంభించింది. దీంతో ఆ ప్రాంతంలో ఆర్మేనియా-అజర్బైజాన్ సైన్యం మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే వేలాదిమంది ప్రజలు ఆ ప్రాంతాన్ని వీడి అర్మేనియాకు తరలిపోతున్నారు. దీంతో ఆ ప్రాంతంలోని రహదారులన్నీ రద్దీగా మారాయి. ఈ క్రమంలోనే మార్గం మధ్యలో ఓ గ్యాస్ స్టేషన్ వద్ద ఇంధనం కోసం వాహనదారులు క్యూ కట్టారు. ఆ సమయంలో అక్కడ ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వకూ 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మంది గాయపడ్డారు. అర్మేనియన్ ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా సోమవారం సాయంత్రం వరకు 6,500 మంది నగర్నో-కరాబఖ్ నివాసితులు ఆర్మేనియాకి తరలిపోయారు.
Also Read..
Anand Mahindra | ఆనంద్ మహీంద్రాపై చీటింగ్ కేసు నమోదు
India-Canada | తీవ్రవాదులకు అడ్డాగా మారిన కెనడా.. భారత్‌కు మద్దతుగా నిలిచిన శ్రీలంక
Viral News | యువకుడిలా కనిపించేందుకు రోజూ 111 మాత్రలు.. రూ.16 కోట్లు ఖర్చు చేస్తున్న మిలియనీర్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

