Massive Fire | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది. ఎంపీల నివాస సముదాయంలో (MPs Apartments) పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్నిమాపక దళాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.
ఢిల్లీలోని బిషంబర్ దాస్ మార్గ్ (BD Marg)లోని బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్స్ (Brahmaputra Apartments)లో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ సభ్యులకు కేటాయించిన ఫ్లాట్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం గురించి మధ్యాహ్నం 1:20 గంటలకు తమకు సమాచారం అందినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. సమాచారం అందగానే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మూడో అంతస్తులో ఒకరికి కాలిన గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
#WATCH | A fire broke out at Brahmaputra Apartments in New Delhi. Six vehicles have been dispatched to the spot
More details awaited pic.twitter.com/eEk0UUyZzU
— ANI (@ANI) October 18, 2025
Also Read..
Samantha | విడాకులు, అనారోగ్యం అన్నీ పబ్లిక్‌గానే జరిగాయి.. నాపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి : సమంత
Gold Rates | ధనత్రయోదశి.. తగ్గిన బంగారం, వెండి ధరలు
Chicken Masala | దివాళీ గిఫ్ట్‌గా.. చికెన్ మసాలా ప్యాకెట్ అందుకున్న ఆలయ ఉద్యోగులు