Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయం, నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ‘ఏమాయ చేశావే’ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మాయ చేసింది సమంత (Samantha). ఆ తర్వాత వరుస సినిమాలతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది. అయితే, సామ్ తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే.
నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకోగా.. ఆ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. మనస్పర్థల కారణంగా నాలుగేండ్లకే విడాకులు (Divorce) తీసుకున్నారు. విడాకుల అనంతరం మయోసైటిస్ బారిన పడ్డారు సామ్. దాన్నుంచి కోలుకునేందుకు సినిమాలను కూడా కొన్నిరోజులు పక్కన పెట్టారు. ఇప్పుడిప్పుడే మళ్లీ తెరపై కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విడాకులు, అనారోగ్యం, ట్రోలింగ్స్‌పై సమంత స్పందించారు.
‘నా జీవితంలో జరిగిన ప్రతి చిన్న విషయం అందరికీ తెలుసు. ఏది జరిగినా అది ప్రజల సమక్షంలోనే జరిగింది. విడాకుల విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ.. అన్ని పబ్లిక్‌గానే జరిగాయి. నేను ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఆ సమయంలో సోషల్ మీడియాలో నాపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. ఎవరికి నచ్చినట్లు వాళ్లు జడ్జిమెంట్స్ ఇచ్చారు. అథెంటిసిటీ అనేది ఓ గమ్యస్థానంగా నేను భావించట్లేదు. ఇది కొనసాగుతూనే ఉంటుంది. నా జీవితంలో ప్రతీది సెట్ కాలేదు. కానీ నేను దాని గురించి మాట్లాడగలుగుతున్నాను. నేనేమి పర్ఫెక్ట్ కాదు.. ఒప్పుకుంటాను. నేనూ కూడా చాలా తప్పులు చేశాను. వాటి నుండి గుణపాఠం కూడా నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు నేను బెటర్‌గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను’ అంటూ సమంత చెప్పుకొచ్చారు.
ఇక సినిమాలకు రాకముందు తన కుటుంబ పరిస్థితి గురించి సామ్ ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాను ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చినట్లు తెలిపారు. జీవితం కష్టంగా ఉండేదన్నారు. ‘నేను ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. జీవితం కష్టంగా ఉండేది. తిండి కోసం కూడా నా కుటుంబం ఎన్నో కష్టాలు పడింది. ఒక్కసారిగా పేరు, డబ్బు, ఖ్యాతి వచ్చాయి. కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు. అవి నాకు ఓ లక్ష్యాన్ని గుర్తు చేశాయి. ఆ లక్ష్యం వైపుగానే అడుగులు వేశాను. నిజాయితీ అనేది మన పెంపకం మీద ఆధారపడుతుంది. దానికి దూరమైతే మనలో అస్థిరత వస్తుంది’ అంటూ సామ్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. సామ్ ఇటీవలే ‘శుభం’ అనే సినిమాతో నిర్మాతగా మారి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఒక కీలకమైన పాత్రలో కూడా నటించింది. అలాగే తన సొంత బ్యానర్లో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తోంది. అలాగే బాలీవుడ్లో ‘రక్తబ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.
Also Read..
Rishab Shetty | ‘కాంతార: చాప్టర్ 1’ విజయం.. బీహార్ ముండేశ్వరి దేవిని దర్శించుకున్న రిషబ్ శెట్టి
Tom Cruise | బ్రేకప్ చెప్పేసుకున్న టామ్ క్రూజ్, అనా డి అర్మాస్.. 9 నెలల రిలేషన్‌షిప్‌కు ముగింపు!