Ana de Armas | హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ (Tom Cruise), నటి అనా డి అర్మాస్ (Ana de Armas) బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలుస్తుంది. గత కొన్నిరోజులుగా డేటింగ్లో ఉన్న ఈ జంట ఇటీవలే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతరిక్షంలో గ్రాండ్‌గా వీరిద్దరి పెళ్లి కాబోతున్నట్లు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలు జనాలు మరువకముందే ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నట్లు హాలీవుడ్ మీడియాలో కథానాలు వస్తున్నాయి. 9 నెలల డేటింగ్ తర్వాత ఈ జంట తమ సంబంధానికి ముగింపు పలికినట్లు సమాచారం.
టామ్ క్రూజ్ (63), అనా డి అర్మాస్ (37)లు డేటింగ్లో మంచి సమయాన్ని గడిపారు. అయితే ఈ రిలేషన్‌ని ముందుకు సాగించాలి అనుకున్నప్పుడు వారిద్దరి మధ్య ఇష్టం తగ్గిపోయింది. దీంతో ఈ బంధం ఎక్కువ కాలం కొనసాగదని గ్రహించిన టామ్, అనాడి స్నేహితులుగా విడిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు పలు మీడియాలు వెల్లడించాయి. అయితే బ్రేకప్ చెప్పుకున్నపటికీ భవిష్యత్‌లో రాబోయే సినిమాల కోసం వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారు. అనా డి అర్మాస్ ఇప్పటికే టామ్ క్రూజ్ తదుపరి చిత్రంలో నటిగా ఎంపికైనట్లు సమాచారం.