Massive Fire | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఘోర అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది. ఓ ఆసుపత్రిలో (Kolkata Hospital) మంటలు చెలరేగి.. ఐసీయూలో ఉన్న రోగి మృతి చెందారు (Patient Dies). సుమారు 80 మంది పేషెంట్లను అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు.
సెంట్రల్ కోల్కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈఎస్ఐ ఆసుపత్రిలోని ఓ వార్డులో చెలరేగిన మంటలు.. క్రమంగా ఆసుపత్రిలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. అప్రమత్తమైన ఆసుపత్రి వర్గాలు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న 10 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి.
ఈ ప్రమాద సమయంలో ఐసీయూ (ICU)లోని ఓ రోగి మరణించగా.. సుమారు 80 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. రోగి మరణానికి ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని పేర్కొన్నారు. ఇది చాలా భయంకరమైన ఘటన అని అభివర్ణించారు. దాదాపు 80 మంది రోగులు లోపల చిక్కుకుపోయారని.. 20 నిమిషాల్లోనే వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు చెప్పారు.
మంటల కారణంగా వార్డు మొత్తం పొగతో నిండిపోవడంతో.. రోగులు కిటికీల్లోంచి మమ్మల్ని రక్షించండి అంటూ అరుస్తున్నారని వివరించారు. మరోవైపు అగ్నిప్రమాద సమాచారం తెలుసుకున్న ఆ రాష్ట్ర అగ్నిమాపక, అత్యవసర సేవల మంత్రి సుజిత్ బోస్ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలుతెలియరాలేదు.
Also Read..
Yahya Sinwar | హమాస్ చీఫ్ సిన్వార్ స్థానాన్ని చేపట్టేదెవరు..? రేసులో పలువురి పేర్లు
Radhika Merchant | రాధికా మర్చంట్ బర్త్డే పార్టీ.. హాజరైన ధోనీ ఇతర స్టార్స్.. ఫొటోలు వైరల్
Jammu & Kashmir: రాష్ట్ర హోదా కోరుతూ జమ్ముకశ్మీర్ మంత్రిమండలి తీర్మానం