Radhika Merchant | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రాధికా మర్చెంట్ (Radhika Merchant)తో అనంత్ వివాహం జులైలో జరిగింది. పెళ్లైన తర్వాత రాధికా మర్చంట్ తొలిసారి అత్తారింట్లో తన 30వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంది. బుధవారం రాత్రి ముంబైలోని అంబానీ నివాసం ఆంటిలియాలో జరిగిన ఈ బర్త్‌డే బాష్ (Birthday Bash)కు పలువురు స్టార్స్ హాజరై సందడి చేశారు.
బుధవారం రాత్రి రాధిక తన అత్తమామలు.. ముఖేశ్- నీతా అంబానీ, తల్లిదండ్రులు శైలా – వీరేన్ మర్చెంట్, ఇషా అంబానీ, కోకిలా బెన్, ఆశాశ్- శ్లోకా సహా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఇంట్లో కేక్ కట్ చేసింది. ఈ పార్టీకి భారత మాజీ క్రికెటర్ ఎమ్ఎస్ ధోనీ (MS Dhoni), స్టార్ నటులు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, రణ్వీర్ సింగ్, అనన్య పాండే, ఒరీ, అర్జున్ కపూర్, శిఖర్ పహారియా, ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్, దర్శకుడు అట్లీ తదితరులు హాజరయ్యారు. రాధికకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఒరీ ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read..
Yahya Sinwar | చనిపోయే ముందు హమాస్ చీఫ్ సిన్వార్ చివరి క్షణాలు.. డ్రోన్ వీడియో
Salman Khan | ప్రాణాలతో ఉండాలంటే 5 కోట్లు ఇవ్వండి.. సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు
Rishabh Pant: కీపింగ్‌కు రిషబ్ పంత్ దూరం.. 6 వికెట్లు కోల్పోయిన కివీస్