బెంగుళూరు: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో.. టీమిండియా కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant) రెండో రోజు గాయపడ్డ విషయం తెలిసిందే. ఓ బంతి నేరుగా వచ్చి అతని మోకాలికి తగిలింది. దీంతో అతను కీపింగ్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ద్రువ్ జూరల్ కీపింగ్ చేపట్టాడు. అయితే ఇవాళ ఉదయం బీసీసీఐ ఓ కీలక ప్రకటన చేసింది. మూడవ రోజు రిషబ్ పంత్ కీపింగ్ చేయడం లేదని బీసీసీఐ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. గాయపడ్డ రిషబ్‌ను ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ పరీక్షిస్తున్నది.
UPDATE: Mr Rishabh Pant will not keep wickets on Day 3.
The BCCI Medical Team is monitoring his progress.
Follow the match – https://t.co/FS97Llv5uq#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) October 18, 2024
మూడవ రోజు మొత్తం రిషబ్ కీపింగ్ చేయడని బీసీసీఐ తెలిపింది. రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్ 37వ ఓవర్లో బంతి నేరుగా వచ్చి రిషబ్ పంత్ కుడి మోకాలికి తగిలింది. ఆ సమయంలో కాన్వే స్ట్రయికింగ్‌లో ఉన్నాడు. వాపు రావడం వల్ల ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు అన్న ఆలోచనతో రిషబ్‌ను దూరం పెట్టినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. 2022 డిసెంబర్లో పంత్‌కు కారు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతనికి కుడి మోకాలికి పలుమార్లు సర్జరీ చేశారు.
న్యూజిలాండ్ మూడవ రోజు 62.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 రన్స్ చేసింది. కివీస్ ప్రస్తుతం 177 రన్స్ ఆధిక్యంలో ఉన్నది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 46 రన్స్‌కే ఆలౌటైన విషయం తెలిసిందే.