Yahya Sinwar | ఇజ్రాయెల్‌తో పోరులో హమాస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిలో ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించిన ఆ మిలిటెంట్ గ్రూప్ అధినేత యహ్యా సిన్వార్ (Yahya Sinwar) ను ఐడీఎఫ్ మట్టుబెట్టింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. గాజాలోని రఫా పట్టణంపై ఐడీఎఫ్ ఈ నెల 7న చేసిన దాడిలో సిన్వార్ హతమైనట్టు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి కట్జ్ గురువారం నిర్ధారించారు.
యహ్యా సిన్వార్.. హమాస్ మిలిటరీ విభాగంలో కీలక వ్యక్తిగా ఎదిగారు. ఐడీఎఫ్ దాడుల్లో సిన్వార్ మృతి చెందడం ఆ గ్రూప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఇప్పుడు ఆ మిలిటెంట్ గ్రూప్‌ను ముందుండి నడిపించేది వెరన్నదానిపై విస్తృతంగా చర్చ నడుస్తోంది (Who Will Replace Yahya Sinwar). రేసులో పలువురు ఉన్నత స్థాయి నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
ఇందులో హమాస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మహమ్మద్ అల్ జహర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన హమాస్ గ్రూప్‌ను ముందుండి నడిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో సిన్వార్ సోదరుడు మహమ్మద్ సిన్వార్ పేరు సైతం ప్రచారంలో ఉంది. హమాస్ పొలిటికల్ బ్యూరో సీనియర్ సభ్యుడు మౌసా అబు మార్జౌక్, హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ మొహమ్మద్ దీఫ్, హమాస్ పొలిటికల్ బ్యూరో ఖలీల్ అల్ హయ్యా, ఖలేద్ మషాల్ సహా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
ఎవరీ సిన్వార్?
1962లో జన్మించిన సిన్వార్ గాజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీ ఆందోళనల్లో పాల్గొనడంతో ఇజ్రాయెల్ 1980లో అరెస్ట్ చేసింది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఇజ్రాయెల్‌పై పోరాటానికి ఆయుధాల ప్రయోగంలో శిక్షణ పొందిన వారిని నియమించి ఒక సంస్థను స్ధాపించాడు. కాసమ్ బ్రిగేడ్స్‌గా పేరొందిన ఆ గ్రూప్ తర్వాత హమాస్ మిలటరీ వింగ్‌గా మారింది. అనంతరం అతడిని అరెస్ట్ చేసిన ఇజ్రాయెల్ 426 ఏండ్ల జైలు శిక్ష విధించింది. 23 ఏండ్లు అతను ఇజ్రాయెల్ జైలులో గడిపాడు. 2011లో ఖైదీల ఒప్పందంతో విడుదలయ్యాడు. 2014లో హమాస్‌లో ప్రధాన నేతగా ఎదిగాడు. గత ఏడాది అక్టోబర్ 7 దాడిలో ప్రధాన పాత్ర పోషించాడు.
అక్టోబర్ 7 దాడులకు సూత్రధారి
గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిలో సిన్వార్ ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ వాంటెడ్ లిస్టులో ఉన్న సిన్వార్ జాడను కనిపెట్టడం ఇజ్రాయెల్‌కు కష్టతరంగా మారింది. గాజాలో నిర్మించిన సొరంగాల్లో ఆయన ఎక్కువగా ఉండేవారు. ఇదే క్రమంలో అప్పటివరకు హమాస్ చీఫ్‌గా ఉన్న ఇస్మాయిల్ హనియా ఇరాన్‌లోని టెహ్రాన్‌లో ఉండగా, ఆగస్టులో ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో ఆయన స్థానాన్ని సిన్వార్ స్వీకరించారు.
Also Read..
Yahya Sinwar | చనిపోయే ముందు హమాస్ చీఫ్ సిన్వార్ చివరి క్షణాలు.. డ్రోన్ వీడియో
Microplastics | ముప్పుగా మైక్రోప్లాస్టిక్.. తల్లి గర్భంలోని పిండంలోకి కూడా..!
Korean War | కొరియా ద్వీపకల్పంలో యుద్ధమేఘాలు..