Microplastics | న్యూయార్క్: భూమిపై అన్ని జీవాల పాలిట మైక్రోప్లాస్టిక్ ముప్పుగా మారుతున్నది. ఇందుకు సంబంధించి అమెరికాలోని రట్జర్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఆందోళన కలిగించే విషయాన్ని వెల్లడించారు. ఎలుకలపై వీరు చేసిన ప్రయోగం వివరాలు ‘సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్మెంట్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
మావి ద్వారా తల్లి నుంచి పిండంలోకి గర్భంలోనే మైక్రోప్లాస్టిక్ చేరుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. పాలిమైడ్-12(పీఏ-12) అనే రకమైన ప్లాస్టిక్‌ను తిన్న ఎలుకలకు పుట్టిన రెండు ఎలుక పిల్లలను రెండు వారాల తర్వాత పరిశోధకులు పరీక్షించారు.
తల్లిగర్భం నుంచి వీటిల్లోకి మైక్రోప్లాస్టిక్ చేరాయని, పుట్టిన తర్వాత కూడా ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, మెదడు కణజాలంలో మైక్రోప్లాస్టిక్ ఉన్నట్టు గుర్తించారు. మనుషులకూ ఈ ప్రమాదం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.