శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదాను ఇవ్వాలని కోరుతూ ఆ రాష్ట్ర మంత్రి మండలి గురువారం తీర్మానం చేసింది. కేంద్ర పాలిత ప్రాంత సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం చేసిన మరుసటి రోజే మంత్రి మండలి తీర్మానం చేసింది. ఒమర్ అబ్దుల్లా నాయకత్వంలో గురువారం క్యాబినెట్ భేటీ జరిగింది. కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై గురువారం రాత్రి వరకు ఆ సర్కారు ఎటువంటి వివరాలను వెల్లడించారు. శ్రీనగర్‌లోని సచివాయంలో ఆ మీటింగ్ జరిగింది. తీర్మానాన్ని ఏకపక్షంగా ఆమోదించారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరారు. ఈ విషయంపై ప్రధాని మోదీతో చర్చించేందుకు సీఎం ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ పర్యటనలో తీర్మానాన్ని ఆయన ప్రధానికి అందజేయనున్నారు.