కొత్తగూడెం ప్రగతి మైదాన్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కోసం గాలిస్తున్న భద్రతా బలగాలు గురువారం సుక్మా జిల్లాలో దుల్లేడ్-మెట్టగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల స్థావరాన్ని గుర్తించి భారీ డంపును స్వాధీనం చేసుకున్నాయి.
అలాగే బీజాపూర్ జిల్లాలో బాసగూడ-ఆవపల్లి వెళ్లే మార్గంలో రోడ్డు వద్ద చెప్టా కింద మావోయిస్టులు అమర్చిన మందుపాతరను గుర్తించి అక్కడే పేల్చివేశాయి.