Manoj Sinha : జమ్ము కశ్మీర్‌లోని రియాసీలో యాత్రికులే లక్ష్యంగా బస్‌పై ఉగ్ర దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. . ఈ ఘటనలో బస్ డ్రైవర్ సహా 9 మంది యాత్రికులు మరణించడంతో పాటు 33 మంది మరణించారు.
ఉగ్ర దాడిని జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్రంగా ఖండించారు. మూడు రోజుల కిందట ఉగ్రవాదులు రియాసీలో మానవత్వంపై వికృత దాడికి తెగబడ్డారని అన్నారు. ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికిందని చెప్పారు.
ప్రజల ఆందోళనను తాను అర్ధం చేసుకోగలనని, మనమంతా భద్రతా దళాలు, జమ్ము కశ్మీర్ పోలీసుల పట్ల విశ్వాసం కలిగిఉండాలని సూచించారు. జమ్ము కశ్మీర్ నుంచి ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను నిర్మూలించినప్పుడే ప్రశాంతత నెలకొంటుందని చెప్పారు.
Read More :
Varalaxmi Sarathkumar | వరలక్ష్మి శరత్‌కుమార్ వెడ్డింగ్‌కు వేళాయే.. వివరాలివే