Caste Census : దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా కీలక డిమాండ్లను ముందుకు తెచ్చారు.
బిహార్ నేతలు నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్, జితన్ రాం మాంఝీ మోదీ సర్కార్‌లో కింగ్ మేకర్లు అయ్యారని పేర్కొన్నారు. బిహార్ ప్రజలు వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అన్నారు.
బిహార్‌కు ప్రత్యేక హోదాను ప్రకటించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని కోరారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని మనోజ్ కుమార్ ఝా డిమాండ్ చేశారు.
Read More :
Gangs of Godavari | విడుదలై నెల కాకుండానే ఓటీటీలోకి విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’