Gangs of Godavari | టాలీవుడ్ నటుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చాలారోజుల తర్వాత ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో హిట్ కొట్టాడు. కృష్ణచైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న రీసెంట్గా బ్రేక్ ఈవెన్‌ను కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా విడుదలై నెల కూడా కాకముందే ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం జూన్ 14 నుంచి తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హీరోది గోదావరిలోని ఓ లంకగ్రామం. పేరు లంకల రత్నాకర్ (విశ్వక్సేన్). వృత్తి దొంగతనం. జీవితంలో ఎలాగైనా ఎదగాలనేది ఇతని లక్ష్యం. దానికోసం ఎందర్నయినా బురిడీ కొట్టించేస్తుంటాడు. ఆ ఏరియాలో.. నానాజీ(నాజర్), దొరస్వామిరాజు(గోపరాజు రమణ)ల ఆధిపత్యపోరు నడుస్తుంటుంది. వీరిలో దొరస్వామిరాజు ఆ ప్రాంత ఎమ్మెల్యే. దాంతో ఎలాగొలా దొరస్వామిరాజు పంచన చేరతాడు రత్నాకర్. నిదానంగా ఆ వర్గంలో కీలకంగా మారతాడు. ఆ తర్వాత ఆ వర్గానికే నాయకుడవుతాడు. దొరస్వామితోనే పోటీకి దిగి ఎమ్మెల్యే కూడా అవుతాడు. ఇక అక్కడ్నుంచి రత్న ఎలా మారాడు? నానాజీ కూతురు బుజ్జి(నేహాశెట్టి)తో ప్రేమలో ఎలా పడ్డాడు? రత్నాకర్‌కీ, రత్నమాలకీ ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలకు సమధానమే మిగిలిన కథ.
Manushulu moodu rakhalu, naashi rakham, rendodhi boshi rakham, moododhi nanyamaina rakham. Ee mooditini dhaati charithalo migilipovadaniki Lankala Ratnam osthunnadu.#GangsofGodavari coming to Netflix on 14 June in Telugu, Tamil, Malayalam, and Kannada! pic.twitter.com/K4gqmj6Xb4
— Netflix India South (@Netflix_INSouth) June 9, 2024