Manohar Lal Khattar | భారత రిపబ్లిక్ డే (Republic Day) వేడుకలు శుక్రవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్ (Kartavya Path)లో జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పలు రాష్ట్రాల్లోనూ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక హర్యానా (Haryana) రాష్ట్రంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రాముడి వేషధారణలో ఉన్న ఓ బాలుడి పాదాలకు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) నమస్కరించారు.
కర్నల్ నగరంలోని మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించారు. సీఎం ఖట్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కొందరు చిన్నారులు రాముడు, సీత, లక్ష్మణుడిగా వేషాలు ధరించి ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శన అనంతరం సీఎం ఖట్టర్ నేరుగా ఆ చిన్నారుల వద్దకు వెళ్లి.. రాముడి వేషధారణలో ఉన్న చిన్నారి పాదాలకు నమస్కరించి (Lord Rams feet) ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
कण-कण और रोम-रोम में बसे सियावर रामचंद्र की जय !
गणतंत्र दिवस समारोह के अवसर पर बाल कलाकारों द्वारा प्रभु श्रीराम जी से जुड़ी प्रस्तुति देखकर भाव विभोर हो गया तथा उनके चरण स्पर्श कर आशीर्वाद प्राप्त करने का सौभाग्य मिला।#RepublicDay2024 pic.twitter.com/QqqKMJlKWK
— Manohar Lal (@mlkhattar) January 26, 2024
Also Read..
Thalapathy Vijay | విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం.. అతిత్వరలో కొత్త పార్టీ ప్రకటన..?
Emmanuel Macron | ఇది ఫ్రాన్స్‌కు దక్కిన గొప్ప గౌరవం.. భారత్‌కు ధన్యవాదాలు : మాక్రాన్
Republic Day Parade | రిపబ్లిక్ డే పరేడ్.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 1,900 చీరలు.. VIDEO