Emmanuel Macron | ఇది ఫ్రాన్స్కు దక్కిన గొప్ప గౌరవం.. భారత్కు ధన్యవాదాలు : మాక్రాన్
Emmanuel Macron | భారత్కు ఫ్రాన్స్ (France) అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) కృతజ్ఞతలు తెలిపారు.
Emmanuel Macron | భారత రిపబ్లిక్ డే వేడుకలు శుక్రవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్ (Kartavya Path)లో జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాలు అంబరాన్నంటాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ (France) అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను రాష్ట్రపతి, ప్రధాని మోదీతో కలిసి మాక్రాన్ వీక్షించారు.
ఈ గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఫ్రాన్స్ దళం కూడా పాల్గొంది. మొత్తం 90 మంది సభ్యులతో కూడి ఫ్రెంచ్ దళం ప్రదర్శన ఇచ్చింది. ఆ సమయంలో రఫేల్ యుద్ధ విమానాలు గగనతలంలో విన్యాసాలు చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమ దేశానికి దక్కిన గొప్ప గౌరవంగా (great honor) అభివర్ణించారు. ఈ సందర్భంగా భారత్కు కృతజ్ఞతలు తెలిపారు.
A great honor for France.
Thank you, India. pic.twitter.com/fXfp4hdCsb— Emmanuel Macron (@EmmanuelMacron) January 26, 2024
Also Read..
Republic Day Parade | రిపబ్లిక్ డే పరేడ్.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 1,900 చీరలు.. VIDEO
Sania Mirza | విడాకుల తర్వాత.. ఆసక్తికరంగా మారిన సానియా తొలి పోస్ట్
Republic Day | భారత్కు రష్యా స్పెషల్ విషెస్.. గదర్ పాటకు స్టెప్పులేసి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

