Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. ఇంఫాల్ చేరుకున్న రాహుల్ గాంధీ.. సహాయక శిబిరాలను సందర్శించేందుకు చురచంద్‌పూర్ వెళ్తుండగా కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. ఆ తర్వాత హింసాత్మక సంఘటనల నేపథ్యంలో పోలీసులు రాహుల్‌కు అనుమతి ఇవ్వలేదు. దాంతో ఆయన తిరిగి ఇంఫాల్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు తోపులాట జరిగింది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
హింస చెలరేగే అవకాశం ఉండడంతో కాన్వాయ్‌ని నిలిపివేసినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. బిష్ణుపూర్ జిల్లాలోని ఉట్లు గ్రామ సమీపంలో హైవేపై టైర్లు తగులబెట్టారు. కాన్వాయ్‌పై రాళ్లు సైతం విసిరారని, దాంతో ముందు జాగ్రత్త చర్యగా బిష్ణుపూర్‌లో రాహుల్ కాన్వాయ్‌ని అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాహుల్ కాన్వాయ్‌ని బిష్ణుపూర్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. అనుమతి లేదని పోలీసులు తెలిపారని, అయితే, రాహుల్‌కు స్వాగతం పలికేందుకు జనం రోడ్లపై ఉన్నారన్నారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు.
కష్టాల్లో ఉన్న ప్రజలను కలిసేందుకు రాహుల్ గాంధీ ఈ పర్యటన చేపట్టారన్నారు. దాదాపు 20-25 కిలోమీటర్లు ప్రయాణించినా ఎక్కడా రోడ్లను దిగ్బంధించలేదన్నారు. స్థానిక పోలీసులకు ఎవరు ఆదేశాలిచ్చారో తెలియదన్నారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందిస్తూ.. మణిపూర్‌లోని అన్ని వర్గాల గోడును వినేందుకు, సహాయం చేసేందుకు రాహుల్ చేస్తున్న ప్రయత్నాలను ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది.
రాహుల్ ఎవరూ అడ్డుకోలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర పేర్కొన్నారు. రాహుల్ పర్యటనను స్థానిక సంస్థలే వ్యతిరేకించాయని, వీటిలో విద్యార్థి సంఘాలు ఉన్నాయన్నారు. రోడ్డుపైకి విద్యార్థులు వచ్చి రాహుల్ ప్రశ్నిస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా.. మే 3 నుంచి మణిపూర్ హింసాత్మక ఘటనలతో అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులకు బీజేపీ, ఆ పార్టీ విభజన రాజకీయాలు కారణమని కాంగ్రెస్ మండిపడింది. అక్కడ శాంతిని నెలకొల్పేందుకు అఖిలపక్ష ప్రతినిధుల బృందాన్ని పంపచడంతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది.
#WATCH | Congress leader Rahul Gandhi reaches Imphal, Manipur
He is on a two-day visit to the state and will visit relief camps and interact with civil society representatives in Imphal and Churachandpur during his visit. pic.twitter.com/eTDbirv53d
— ANI (@ANI) June 29, 2023