న్యూఢిల్లీ: భార్య వదిలేసి వెళ్లిపోవడంతో ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. దివ్యాంగులైన ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (Man Kills Children, Hangs Self) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా- నాగర్ హవేలి, డామన్-డయ్యూలో ఈ సంఘటన జరిగింది. సిల్వాసాలోని అద్దె ఇంట్లో నివసించే 56 ఏళ్ల సునీల్ భాకరే భార్య రెండు వారాల కిందట అతడ్ని విడిచి వెళ్లింది. దీంతో వికలాంగ పిల్లలను పెంచడం కష్టంగా అతడు భావించాడు. శుక్రవారం మధ్యాహ్నం దివ్యాంగులైన 18 ఏళ్ల జే, పదేళ్ల ఆర్యను తాడుతో గొంతునొక్కి హత్య చేశాడు. ఆ తర్వాత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముంబై సమీపంలోని రాయ్‌గడ్‌కు చెందిన ఈ కుటుంబం రెండు దశాబ్దాలుగా సిల్వాసాలో నివసిస్తున్నదని పోలీస్ అధికారి తెలిపారు. రెండు వారాల కిందట భార్య విడిచిపెట్టడంతో సునీల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
మరోవైపు దివ్యాంగులైన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చిన తర్వాత తాడుతో వారి గొంతునొక్కి చంపాడని, ఆ తర్వాత అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీస్ అధికారి అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
IndiGo Aircraft’s Tail Hits Runway | ల్యాండింగ్ సమయంలో.. రన్‌వేను తాకిన ఇండిగో విమానం తోక భాగం
Man Tied To Pole Thrashed | అల్లున్ని స్తంభానికి కట్టేసి కొట్టి.. రాత్రంతా అలాగే ఉంచిన అత్తమామలు