Crime news | నేరస్తుడని తెలిసి ప్రేమకు నిరాకరణ.. యువతి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి..!
Crime news | తమిళనాడు (Tamil Nadu) లోని కోయంబత్తూరు (Coimbatore) లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాను ప్రేమించిన వ్యక్తి నేరస్తుడు అని తెలిసి ఓ యువతి అతడిని దూరం పెట్టింది. అయితే తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఆ వ్యక్తి యువతి ఇంటిపై పెట్రోల్ బాంబుల (Petrol Bombs) తో దాడికి పాల్పడ్డాడు. కోయంబత్తూరు సమీపంలోని తొండముత్తూరు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు.
Crime news : తమిళనాడు (Tamil Nadu) లోని కోయంబత్తూరు (Coimbatore) లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాను ప్రేమించిన వ్యక్తి నేరస్తుడు అని తెలిసి ఓ యువతి అతడిని దూరం పెట్టింది. అయితే తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఆ వ్యక్తి యువతి ఇంటిపై పెట్రోల్ బాంబుల (Petrol Bombs) తో దాడికి పాల్పడ్డాడు. కోయంబత్తూరు సమీపంలోని తొండముత్తూరు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కార్తీ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. ఆమె కూడా అతడిని ఇష్టపడింది. అయితే సదరు యువకుడికి నేరచరిత్ర ఉన్నదనే విషయం తెలుసుకున్న తర్వాత యువతి అతడిని దూరం పెట్టింది. ప్రేమించేందుకు నిరాకరించింది. దాంతో యువతిపై కోపం పెంచుకున్న కార్తీ తన స్నేహితుడితో కలిసి బైకుపై యువతి ఇంటివైపు వెళ్లాడు. వెంట తీసుకెళ్లిన రెండు పెట్రోల్ బాంబులను ఆ ఇంటిపై వేశాడు.
దాంతో యువతి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన ఆమె కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి నీళ్లు చల్లి మంటలను ఆర్పేశారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని యువతి కుటుంబసభ్యులు తెలిపారు. కాగా ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కార్తీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న అతడి స్నేహితుడి కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

